గుజరాత్‌లోని సూరత్‌లో భారీ వర్షం కారణంగా కొత్తగా నిర్మించిన రోడ్డు పూర్తిగా ధ్వంసమైంది. రోడ్డు మధ్యలో ఏర్పడిన పెద్ద గుంతలో లారీ దిగబడిపోవడంతో, వాహనాన్ని బయటకు తీయడానికి తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యాయి. స్మార్ట్ సిటీ అంటూ బీజేపీ ప్రభుత్వం ప్రచారం చేసుకుంటుంటే, ఇలాంటి నాసిరక రోడ్లు ఎందుకు అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. స్మార్ట్ సిటీ నిధులు ఎక్కడికి వెళ్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.