గౌహతిలో భారీ వర్షం: RR vs MI టాస్ ఆలస్యం, మ్యాచ్ రద్దయ్యే ప్రమాదం!

గౌహతిలో భారీ వర్షం కారణంగా ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026లో భాగంగా రాజస్థాన్ వర్సెస్ ముంబై మ్యాచ్ టాస్ ఆలస్యమైంది. సాయంత్రం 4 గంటల నుంచి కురుస్తున్న వర్షంతో పాటు, రాబోయే మూడు గంటల పాటు ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురుస్తుందని వాతావరణ శాఖ 'ఆరెంజ్ అలర్ట్' జారీ చేసింది. రాత్రి 9 గంటల తర్వాత వర్షం తగ్గితే, ఓవర్ల సంఖ్యను తగ్గించి మ్యాచ్ నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. వర్షం వల్ల పిచ్‌పై తేమ పెరిగి బౌలర్లకు అనుకూలంగా మారే అవకాశం ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్