హైదరాబాద్‌లో దంచికొడుతున్న వర్షం (VIDEO)

TG: దాదాపు నెల రోజుల విరామం తర్వాత హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. కాప్రా, ఘట్‌కేసర్‌, బోడుప్పల్‌, మేడిపల్లి, చర్లపల్లి, నానక్‌రామ్‌గూడ, మణికొండ, టోలిచౌకి, షేక్‌పేట ప్రాంతాల్లో భారీ వర్షం పడుతోంది. మరికాసేపట్లో సికింద్రాబాద్‌, నాంపల్లి, ఖైరతాబాద్‌, హయత్‌నగర్‌, జూబ్లీహిల్స్‌, ఉప్పల్‌, దిల్‌సుఖ్‌నగర్‌ ప్రాంతాల్లోనూ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.

సంబంధిత పోస్ట్

✕
✕