తెలంగాణలోని పలు ప్రాంతాల్లో వర్షాలు పడుతున్నాయి. GHMC పరిధిలోని ఆల్వాల్, జీడిమెట్ల, బొల్లారం, కాప్రా, యాప్రాల్, సైనిక్‌పురి, దమ్మాయిగూడ, కూకట్పల్లి, మాదాపూర్, ఎర్రగడ్డ, కుత్బుల్లాపూర్‌లో వర్షం దంచికొడుతోంది. మేడ్చల్, మెదక్, సిద్దిపేట, యాదాద్రి, వికారాబాద్, నల్గొండ, మహబూబ్‌నగర్, వనపర్తి, గద్వాల్ జిల్లాల్లోనూ ఎడతెరిపి లేని వానలు కురుస్తున్నాయి. విస్తారంగా వర్షాలు పడుతుండటంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.