తెలంగాణలోని పలు జిల్లాల్లో గురువారం సాయంత్రం భారీ వర్షం దంచికొట్టింది. కామారెడ్డి పట్టణంలో భారీ వాన కురిసింది. అటు కరీంనగర్ (D) వీణవంక, తిమ్మాపూర్, హుజూరాబాద్‌లో, పెద్దపల్లి(D) కాల్వశ్రీరాంపూర్, సిరిసిల్ల జిల్లాలోని ఎల్లారెడ్డిపేట, వరంగల్(D) చెన్నారావుపేట, నర్సంపేట, దుగ్గొండితో పాటు పలు మండలాల్లో భారీ వర్షం పడింది. ఏపీలోని విజయనగరం(D) రేగిడి మండలంలోనూ వర్షం కురిసింది. ఇవాళ రాత్రి వరకూ నైరుతిరుతుపవనాలు కేరళం తీరాన్ని తాకే అవకాశం ఉన్నందున TGలో భారీ వర్షాలు పడతాయని HYD వాతావరణ శాఖ హెచ్చరించింది.