తెలంగాణలోని పలు జిల్లాల్లో వడగండ్లతో కూడిన భారీ వర్షం పడుతోంది. ఖమ్మం, భద్రాద్రి, కామారెడ్డి జిల్లాలో వాన దంచికొడుతుంది. జనగామ జిల్లాల్లో పలు చోట్ల ఈదురు గాలులతో భారీ వడగండ్ల వాన కురిసింది. జనగామ వ్యవసాయ మార్కెట్ యార్డులో రైతుల ధాన్యం వర్షానికి తడిసి ముద్దయింది. జనగామ, లింగాల, గణపురం, రఘునాథపల్లి మండలాల్లో కురిసిన వర్షానికి పంట నేల రాలింది. ఖమ్మం(D) సత్తుపల్లి నియోజకవర్గం వ్యాప్తంగా ఉరుములు, మెరుపులతో భారీ వర్షం కురుస్తోంది.