ఈ జిల్లాల్లో భారీ వర్షం (వీడియో)

TG: రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వర్షం పడుతోంది. మెదక్, కామారెడ్డి, నిజామాబాద్, సిద్దిపేట, జనగాం, హనుమకొండ, వరంగల్, సిరిసిల్ల, ములుగు, భూపాలపల్లి జిల్లాల్లో వానలు కురుస్తున్నాయి. మరికాసేపట్లో మహబూబాబాద్, భద్రాద్రి జిల్లాల్లోనూ మోస్తరు నుంచి భారీ వర్షాలకు అవకాశం ఉందని వాతావరణ నిపుణులు అంచనా వేశారు. హైదరాబాద్‌లో పలు ప్రాంతాల్లో చిరుజల్లులు కురుస్తున్నాయి.

సంబంధిత పోస్ట్