ఒకవైపు భారీ వర్షం.. ట్యాంకర్‌తో మొక్కలకు నీరు పోసిన మున్సిపల్‌ సిబ్బంది

మహారాష్ట్రలోని పూణేలో భారీ వర్షాలు కురుస్తున్నప్పటికీ.. మున్సిపల్ సిబ్బంది రోడ్డు డివైడర్‌లోని మొక్కలకు ట్యాంకర్ల ద్వారా నీరు పోశారు. ఈ సంఘటన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో, సిబ్బందితో పాటు అధికారులపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. వాతావరణ పరిస్థితులను గమనించకుండా యాంత్రికంగా పనిచేస్తున్నారని, ప్రజాధనాన్ని వృధా చేస్తున్నారని నెటిజన్లు మండిపడుతున్నారు. ఈ చర్యలపై సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్