దేశవ్యాప్తంగా భారీ వర్షాలు: వాతావరణ శాఖ

రుతుపవనాలు చురుకుగా మారడంతో దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాలకు భారత వాతావరణ శాఖ (IMD) భారీ నుంచి అతి భారీ వర్షాల హెచ్చరికలు జారీ చేసింది. తెలుగు రాష్ట్రాలతో పాటు ఉత్తర, ఈశాన్య, దక్షిణ భారత ప్రాంతాల్లో బుధవారం భారీ వర్షాలతో వరదలు, కొండచరియలు విరిగిపడే ప్రమాదం ఉందని హెచ్చరించింది. వాతావరణ మార్పుల ప్రభావంతో వడగాలులు, పిడుగుపాట్లను కూడా ప్రకృతి వైపరీత్యాల జాబితాలో చేర్చారు. మార్చి 1 నుంచి జూలై 26 వరకు దేశవ్యాప్తంగా 4,853 వడదెబ్బ కేసులు, 20 మరణాలు నమోదయ్యాయి, ఇందులో అత్యధిక కేసులు తెలంగాణలోనే నమోదయ్యాయి.

సంబంధిత పోస్ట్