జూన్ లో భారీ వర్షపాత లోటు.. 125 ఏళ్లలో ఐదోసారి

ఈ ఏడాది జూన్ నెలలో దేశవ్యాప్తంగా సాధారణం కంటే 43 శాతం తక్కువ వర్షపాతం నమోదైంది. గత 125 ఏళ్లలో ఇలాంటి పరిస్థితులు ఐదోసారి ఏర్పడ్డాయని భారత వాతావరణ శాఖ నివేదిక వెల్లడించింది. మధ్య భారతదేశంలో 56%, ఈశాన్య రాష్ట్రాల్లో 43%, దక్షిణాదిలో 31%, వాయవ్య రాష్ట్రాల్లో 29% లోటు నమోదైంది. 315 జిల్లాలు తక్కువ వర్షపాతం వల్ల ప్రభావితమయ్యే అవకాశం ఉందని, వాటిలో 111 జిల్లాలను ‘అత్యంత అప్రమత్తత’ జిల్లాలుగా కేంద్ర వ్యవసాయ శాఖ ప్రకటించింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సహా 12 రాష్ట్రాల జిల్లాలు ఈ జాబితాలో ఉన్నాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్