భారీ వర్షాలు.. 14 మంది మృతి

ఈశాన్య రుతుపవనాల ప్రభావంతో తమిళనాడులో గత మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా 14 మంది మరణించారని మంత్రి సెంగోట్టయ్యన్ తెలిపారు. కోయంబత్తూరు, నీలగిరి జిల్లాల్లో జనజీవనం తీవ్రంగా దెబ్బతింది, పంట పొలాలు నీటమునిగాయి. నీలగిరిలో 62 చోట్ల కొండచరియలు విరిగిపడ్డాయి. అయితే, వాతావరణ శాఖ అంచనా ప్రకారం నేటి నుంచి వర్షాల తీవ్రత తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని సమాచారం. భారీ వర్షాల వల్ల రాష్ట్రవ్యాప్తంగా సాధారణ పరిస్థితులు అస్తవ్యస్తమయ్యాయి.

సంబంధిత పోస్ట్

✕
✕