రాజస్థాన్‌లోని రాజసమంద్ జిల్లాలో ముసళధార వర్షాలు జనజీవనాన్ని తీవ్రంగా ప్రభావితం చేశాయి. రహదారులు నదులుగా మారిపోగా, మచింద్ గ్రామంలో ఓ కారు ప్రవాహంలో కొట్టుకుపోయింది. ఈ దృశ్యం సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇళ్లలోకి నీరు చేరడంతో స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు. వాతావరణ శాఖ భారీ వర్షాల నేపథ్యంలో ఆరెంజ్, ఎల్లో అలర్ట్ జారీ చేస్తూ ప్రజలను జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించింది.