తెలుగు రాష్ట్రాల్లో జులై 1 నుంచి 7 వరకు రానున్న వారం రోజుల పాటు వర్షాలు కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఆంధ్రప్రదేశ్‌లో ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో వర్షాల తీవ్రత రోజువారీగా మారే అవకాశం ఉందని.. మరో వైపు తెలంగాణలోనూ పలు జిల్లాల్లో భారీ వర్షాలు, గంటకు 30-50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశముందని తెలిపింది. ఉరుములు, మెరుపులు, బలమైన ఈదురుగాలుల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది.