TG: వరంగల్, హనుమకొండ పరిధిలో ఆదివారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. దీంతో ప్రధాన రహదారులన్నీ జలమయమయ్యాయి. ముఖ్యంగా హనుమకొండలోని హంటర్ రోడ్డు, సుబేదారి, నక్కలగుట్ట, పబ్లిక్ గార్డెన్, నయీంనగర్, డబ్బాల్, భీమారం ప్రాంతాల్లో భారీ వర్షపాతం నమోదైంది. రోడ్లపై నీరు నిలిచిపోవడంతో అవి చెరువులను తలపించాయి. ఈ పరిస్థితి వల్ల స్థానిక ప్రజలు, వాహనదారులు, పాదచారులు రాకపోకలు సాగించడంలో తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొన్నారు.