తెలంగాణలో మరో రెండు రోజులపాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, ఉత్తర, ఈశాన్య జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. నేడు మంచిర్యాల, కుమురంభీం ఆసిఫాబాద్, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించింది. దక్షిణ తెలంగాణ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. హైదరాబాద్లో సాధారణ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.