TG: రాష్ట్రవ్యాప్తంగా రానున్న ఐదు రోజుల పాటు ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. జూన్ 12 నుంచి 17 వరకు మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అదే సమయంలో ఆదిలాబాద్, కొమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్ జిల్లాల్లో వడగాల్పులు తీవ్రంగా ఉంటాయని తెలిపింది. దీంతో ఆయా జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ అయ్యాయి.