ఉత్తరప్రదేశ్‌లో కురుస్తున్న భారీ వర్షాల ప్రభావంతో ప్రయాగ్‌రాజ్‌లో గంగా, యమున నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. నదుల నీటిమట్టం 81 మీటర్లను దాటి ప్రమాదస్థాయికి చేరింది. పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని అధికారులు అప్రమత్తమయ్యారు. వరద ప్రవాహం మరింత పెరిగే అవకాశం ఉండటంతో లోతట్టు ప్రాంతాల ప్రజలను హెచ్చరిస్తూ జాగ్రత్త చర్యలు చేపడుతున్నారు.