దేశవ్యాప్తంగా 20 రాష్ట్రాల్లో భారీ వర్షాలు: వాతావరణ శాఖ

దేశంలోని దాదాపు 20 రాష్ట్రాల్లో భారీ వర్షాలు, ఈదురు గాలులు, ఉరుములతో కూడిన వాతావరణం ఉంటుందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. తెలంగాణ, ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌లలో గంటకు 70-75 కి.మీ వేగంతో బలమైన గాలులు వీచే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్, ఢిల్లీ, మహారాష్ట్ర, యూపీ, బీహార్ సహా పలు రాష్ట్రాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో ఢిల్లీకి ఎల్లో అలర్ట్ జారీ చేశారు. వాతావరణ మార్పుల దృష్ట్యా రైతులు పంటలను భద్రపరుచుకోవాలని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

సంబంధిత పోస్ట్

✕
✕