చెన్నైలో భారీ వర్షాలు కురుస్తుండటంతో రెడ్ అలర్ట్ జారీ చేశారు. నగరంతో పాటు శివారు ప్రాంతాల్లోనూ వర్షాలు పడుతున్నాయి. ముఖ్యంగా ఉత్తర చెన్నైలోని పలు ప్రాంతాలు నీటమునిగాయి. పరిస్థితిపై ముఖ్యమంత్రి విజయ్ అధికారులతో అత్యవసర సమావేశం నిర్వహించారు. భారీ వర్షాల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని, ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.