ఢిల్లీలో పట్టపగలే కుండపోత వర్షం కురిసింది. దేశ రాజధాని నగరాన్ని భారీ వర్షం ముంచెత్తింది. దీనితో రోడ్లు, లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. జనజీవనం స్తంభించిపోయింది. అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) హెచ్చరించింది. ఈ వర్షాల కారణంగా ఢిల్లీ అతలాకుతలం అయింది.