ఢిల్లీలో బుధవారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. దీంతో రోడ్లపై నీరు నిలిచిపోయి.. భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. పని వేళలు ముగిసే సమయం కావడంతో నగర వాసులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. మోకాలి లోతు నీటితో రహదారులు నిండిపోయాయి. గురు, శుక్రవారాల్లో మరింత వర్షం ఉండే అవకాశం ఉందని, ప్రజలు అవసరమైతేనే బయటకు రావాలని అధికారులు సూచించారు. ఢిల్లీలో ఆరెంజ్ అలర్ట్ ఉండగా వాతావరణ శాఖ దాన్ని రెడ్ అలర్ట్‌గా మార్చింది.