ముంబైలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు. డబ్బావాలా సేవలు నిలిపివేశారు. ముంబై యూనివర్సిటీ పరిధిలో జరగాల్సిన అన్ని పరీక్షలు వాయిదా వేశారు. భారీ వర్షాలతో విమాన సేవలకు అంతరాయం ఏర్పడింది. రోడ్లు చెరువులను తలపిస్తున్నాయి. రైల్వేస్టేషన్లలో ట్రాక్‌లు వరదనీటితో మునిగిపోయాయి. ముంబై మాంఖుర్డ్ ప్రాంతంలో ఇల్లు కూలి ఆరుగురి మృతి చెందగా బాధిత కుటుంబాలకు సీఎం ఫడణవీస్ రూ.5 లక్షల ఆర్థిక సహాయం ప్రకటించారు.