తెలంగాణలో ఇవాళ పలు జిల్లాల్లో భారీ వర్షాలు: వాతావరణ శాఖ

TG: నైరుతి రుతుపవనాల విస్తరణతో తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం మారుతోంది. తెలంగాణలో జూన్ 13న మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్ వంటి జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఆదిలాబాద్, నిర్మల్ వంటి ఉత్తర తెలంగాణ జిల్లాల్లో వడగాల్పులు కొనసాగే ప్రమాదం ఉంది. హైదరాబాద్‌లో ఆకాశం మబ్బులతో కూడి, సాయంత్రం లేదా రాత్రి తేలికపాటి జల్లులు పడవచ్చు.

సంబంధిత పోస్ట్