స్పెయిన్‌లో భారీ వర్షాలు కురిసి రోడ్లన్నీ నదులను తలపిస్తున్నాయి. ఒక్క గంటలోనే 100 మిల్లీమీటర్లకు పైగా వర్షం పడటంతో వందలాది కార్లు వరదలో కొట్టుకుపోయాయి. ఈ వరదల్లో దాదాపుగా వందల మందికి పైగా గల్లంతయినట్లు సమాచారం. రెస్క్యూ బృందాలు రంగంలోకి దిగి గాలింపు చర్యలు కొనసాగిస్తున్నాయి. కొన్నిచోట్ల విద్యుత్, రవాణా వ్యవస్థలు పూర్తిగా స్థంభించాయి. ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు.