తెలంగాణలో భారీ వర్షాలు.. ఆరెంజ్ అలర్ట్ జారీ

TG: రాష్ట్రంలో శని, ఆదివారాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఆదిలాబాద్, కుమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, పెద్దపల్లి జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేయబడింది. రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, జయశంకర్‌ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో కూడా పలు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని తెలిపింది.

సంబంధిత పోస్ట్