తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు మళ్లీ జోరందుకున్నాయి. తెలంగాణలో జగిత్యాల, పెద్దపల్లి జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తుండగా, ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతిలోనూ వర్షం కురిసింది. మరోవైపు రాష్ట్రంలో నేటి నుంచి మూడ్రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ మేరకు పలు జిల్లాలకు అలర్ట్ జారీ చేసింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అవసరమైతే తప్పా బయటకు రావొద్దని సూచించింది.