తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు: వాతావరణ శాఖ

గత రెండు వారాలుగా తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ప్రభావంతో గురువారం ఏపీ, తెలంగాణలో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. హైదరాబాద్‌తో పాటు పలు జిల్లాలకు ఎల్లో, ఆరెంజ్ అలర్ట్‌లు జారీ చేశారు. సంగారెడ్డి జిల్లాలో భారీ వర్షం, మరికొన్ని జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఏపీలోనూ పిడుగులతో కూడిన వర్షాలు, ముఖ్యంగా విజయనగరం, విశాఖ, అనకాపల్లి జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు.

సంబంధిత పోస్ట్