రాబోయే 2 గంటల్లో ఈ జిల్లాలో భారీ వర్షాలు

TG: రాష్ట్రవ్యాప్తంగా రుతుపవనాలు విస్తరిస్తున్న నేపథ్యంలో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వాతావరణం అకస్మాత్తుగా మారింది. రాబోయే రెండు గంటల్లో మంచిర్యాల, జగిత్యాల, పెద్దపల్లి, భూపాలపల్లి, కరీంనగర్, వరంగల్ రూరల్, ములుగు, సిద్దిపేట, జనగామ, యాదాద్రి భువనగిరి, మహబూబాబాద్ జిల్లాల్లో భారీ ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన తీవ్రమైన తుపాన్లు సంభవించే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. సంగారెడ్డి, రంగారెడ్డి, కామారెడ్డి, నిర్మల్, ఆదిలాబాద్, ఆసిఫాబాద్ జిల్లాల్లో మోస్తరు నుంచి సాధారణ వర్షాలు కురిసే అవకాశం ఉంది.

సంబంధిత పోస్ట్