ఉత్తరాఖండ్‌లో భారీ వర్షాలు.. ఛార్‌ధామ్ యాత్ర రద్దు

ఉత్తరాఖండ్‌లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో, శని, ఆదివారాల్లో ఛార్‌ధామ్ యాత్రను రద్దు చేశారు. భారత వాతావరణ శాఖ పలు జిల్లాలకు రెడ్, ఆరెంజ్ అలర్ట్‌లు జారీ చేసింది. వాతావరణం మెరుగుపడిన తర్వాత యాత్ర పునఃప్రారంభించబడుతుంది. శనివారం భగేశ్వర్, పిత్తోరఘర్, చంపావత్, నైనిటాల్, ఉద్దంసింగ్ నగర్‌లకు రెడ్ అలర్ట్, డెహ్రాడూన్, పౌరి, రుద్రప్రయాగ్, చమోలీ, అల్మోరా జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. ఆదివారం డెహ్రాడూన్, తెహ్రీ, పౌరి, హరిద్వార్‌లకు రెడ్ అలర్ట్ ప్రకటించారు.

సంబంధిత పోస్ట్

✕
✕