ముంబైలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా వర్షం దంచి కొట్టడంతో లోతట్టు ప్రాంతాలు నీటితో నిండిపోయాయి. ప్రధాన రహదారులు చెరువులను తలపిస్తున్నాయి. కొన్ని ప్రాంతాల్లో కార్లు, ఇతర వాహనాలు వరద నీటిలో మునిగిపోయాయి. దీంతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. రైల్వే స్టేషన్లలో జనం కిక్కిరిసిపోయారు.