తెలంగాణలో ఈ నెల 5వ తేదీ వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఐటీ సంస్థలు తమ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ సౌకర్యాన్ని కల్పించాలని సైబరాబాద్ పోలీసులు సూచించారు. ట్రాఫిక్ రద్దీని తగ్గించడానికి, అత్యవసర సేవలకు ఆటంకం కలగకుండా ఉండేందుకు, ఆఫీసుల నుండి మధ్యాహ్నం 2 గంటలకే లాగౌట్ అయ్యేలా చూడాలని కోరారు. ఉద్యోగుల భద్రతే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. కంపెనీల వివరాలు, ఎర్లీ లాగౌట్ సమాచారాన్ని cybtrcc@gmail.comకు పంపాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.