తెలుగు రాష్ట్రాల్లో మరో నాలుగు రోజులు భారీ వర్షాలు

బంగాళాఖాతంలో ఏర్పడిన ఆవర్తనం కారణంగా తెలుగు రాష్ట్రాల్లో మరో 4 రోజుల పాటు ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. గురువారం ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీ సత్యసాయి, పోలవరం, కోనసీమ, గోదావరి జిల్లాలు, నెల్లూరు, తిరుపతి ప్రాంతాల్లో భారీ వర్షాలు పడతాయని అంచనా వేసింది. అలాగే తెలంగాణలో హైదరాబాద్‌తో పాటు ఉత్తర, మధ్య ప్రాంతాల్లో ఇవాళ మధ్యాహ్నం తర్వాత జల్లులు కురుస్తాయి. పిడుగుల ముప్పు ఉన్నందున ప్రజలు చెట్లు, పోల్స్, హోర్డింగ్స్ కింద నిలబడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరికలు జారీ చేశారు.

సంబంధిత పోస్ట్