TG: సెప్టెంబర్ 19, 20, 21 తేదీల్లో రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు సంభవించవచ్చు. గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది. నైరుతి రుతుపవనాలు రాజస్థాన్ నుంచి ఉపసంహరించుకున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడే అల్పపీడనం, వాయుగుండం ప్రభావంతో ఈ వర్షాలు కురుస్తాయని IMD అంచనా వేసింది.