ఇవాళ భారీ వర్షాలు.. ఉత్తర తెలంగాణ జిల్లాలకు ఎల్లో అలర్ట్

తెలంగాణలో నైరుతి రుతుపవనాలు మరింత విస్తరించినట్లు వాతావరణ శాఖ తెలిపింది. దీంతో రాష్ట్రంలో జూలై 3 నుంచి 8వ తేదీ వరకు పలుచోట్ల మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. కాగా, ఈరోజు ఉత్తర తెలంగాణ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఆదిలాబాద్, కొమురం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముందని హెచ్చరించింది. అలాగే గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

సంబంధిత పోస్ట్