దేశీయ మార్కెట్లు ఈ వారం లాభాల్లో కొనసాగుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ల సానుకూల సంకేతాలు, అమెరికా ఫెడరల్ రిజర్వ్ రేట్ల కోత అంచనాలు మదుపరుల ఉత్సాహాన్ని పెంచాయి. ఉదయం 9.33 గంటలకు సెన్సెక్స్ 381 పాయింట్లు ఎగసి 81,489 వద్ద, నిఫ్టీ 118 పాయింట్లు పెరిగి 24,987 వద్ద ప్రారంభమయ్యాయి. రూపాయి మారకం విలువ డాలర్‌తో పోలిస్తే 88.13గా ఉంది.