హనుమాన్ శోభాయాత్రకు భారీ బందోబస్తు: సీపీ సజ్జనార్

TG: హైదరాబాదులో హనుమాన్ శోభాయాత్ర ఘనంగా జరగనుంది. ఈ శోభాయాత్రకు మూడు వేల మంది సిబ్బందితో భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామని హైదరాబాద్ సీపీ సజ్జనార్ వెల్లడించారు. హనుమాన్ శోభాయాత్రకు సంబంధించి అధికారులతో ఇదివరకే సమీక్ష చేశామన్నారు. డ్రోన్లు, సీసీటీవీ ఉపయోగించి భధ్రతను పర్యవేక్షిస్తామన్నారు. శోభాయాత్రని విజయవంతంగా జరుపుకునేందుకు హైదరాబాద్ ప్రజలు సహకరించాలని సీపీ సజ్జనార్ కోరారు.

సంబంధిత పోస్ట్