ఉత్తర జపాన్‌లో తీవ్ర హిమపాతం సంభవించింది. ఒక చోట ఏకంగా 72 అంగుళాల మేర మంచు పేరుకుపోయింది. గత 40 ఏళ్లలో జపాన్‌లో ఇదే అత్యధిక హిమపాతం. ఈ ప్రకృతి వైపరీత్యం కారణంగా ఇప్పటికే 35 మంది మృతి చెందగా, 200 మందికి పైగా గాయపడ్డారు. ఈ సంఘటన స్థానికంగా తీవ్ర ఆందోళనను రేకెత్తించింది.