భారీ హిమపాతం.. ఏడుగురి మృతి

జమ్మూ కశ్మీర్‌, లద్దాఖ్‌లను కలిపే జోజిలా కనుమ ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. భారీ హిమపాతం సంభవించడంతో ఏడుగురు మృతి చెందారు. మరో ఐదుగురికి గాయాలయ్యాయి. శ్రీనగర్‌-లేహ్‌ జాతీయ రహదారిపై వాహనాలు నిలిచిపోయి, పలువురు చిక్కుకుపోయారు. అధికారులు మార్గాన్ని పునరుద్ధరించేందుకు ప్రయత్నిస్తున్నారు. కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్‌ ఈ ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసి, సహాయక చర్యలు చేపట్టినట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్