బంగాళాఖాతంలో మరో 12-36 గంటల్లో అల్పపీడనం ఏర్పడనుందని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. APలోని SKLM, VZM, VSP, మన్యం, అల్లూరి, అనకాపల్లి, కాకినాడ, ఏలూరు, కృష్ణా, NTR, గుంటూరు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని APSDMA తెలిపింది. అటు మంగళవారం ఉదయం 8.30 వరకు TGలోని కొత్తగూడెం, భూపాలపల్లి, ములుగు, పెద్దపల్లి జిల్లాల్లో అతిభారీ వర్షాలు కురుస్తాయంది.