శ్రీశైలం ఘాట్ రోడ్డులో భారీగా ట్రాఫిక్ జామ్

AP: శ్రీశైలం ఘాట్ రోడ్డులో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. మార్కాపురం జిల్లా దోర్నాల మండలం శ్రీశైలం ఘాట్ రోడ్డులోని చింతల సమీపంలో ఓ లారీ అకస్మాత్తుగా రిపేర్‌కు గురై రోడ్డుపై నిలిచిపోవడంతో వాహనాల రాకపోకలు పూర్తిగా స్తంభించాయి. దీంతో దోర్నాల నుంచి శ్రీశైలం వెళ్లే వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. క్రేన్ సహాయంతో లారీని రోడ్డుపక్కకు తరలించి ట్రాఫిక్‌ను క్లియర్ చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్