దీపావళికి సొంతూళ్లకు వెళ్లిన ప్రజలు తిరిగి హైదరాబాద్ బాట పట్టారు. దీంతో విజయవాడ-హైదరాబాద్ జాతీయ రహదారిపై వాహనాల రద్దీ భారీగా పెరిగింది. పంతంగి టోల్‌ప్లాజా, ఇతర టోల్‌ప్లాజాల వద్ద వాహనాలు బారులు తీరాయి. హైదరాబాద్ శివారు అబ్దుల్లాపూర్‌మెట్ నుంచి ఎల్బీనగర్ వరకు స్వల్పంగా ట్రాఫిక్ జామ్ అయింది.