చైనాలోని చాంగ్‌జౌ నగరంలో గురువారం ఒక హెలికాప్టర్ ల్యాండింగ్ అవుతుండగా ఒక్కసారిగా నియంత్రణ కోల్పోయి కుప్పకూలింది. నేలను తాకిన వెంటనే అది వేగంగా తిరుగుతూ పడిపోయింది. ఈ ఘోర ప్రమాదంలో హెలికాప్టర్‌లో ప్రయాణిస్తున్న ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదం జరిగిన వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న రెస్క్యూ సిబ్బంది బాధితులను చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.