భారత్ నుంచి అమెరికాకు ఎగుమతి అయ్యే వస్తువులపై 26% పరస్పర సుంకాలను విధించింది. ఇది ఆగస్టు 1 నుంచి అమల్లోకి వస్తుందని ప్రకటించింది. ఆటోమొబైల్స్, వజ్రాలు, ఆభరణాలు, టెలికం పరికరాలపై 25% సుంకాలు అమలవుతాయి. ఔషధాలు (ఇన్సులిన్, విటమిన్లు), సెమీకండక్టర్లు, రాగిలాంటి ఉత్పత్తులపై సుంకాలు లేవు. ఇంకా చైనాపై 34%, వియత్నాంపై 46%, కంబోడియాపై 49% సుంకాలు విధించారు. ఈ చర్య వల్ల భారత వస్తువుల ఎగుమతి, వ్యాపారాలపై ప్రభావం చూపే అవకాశం ఉంది.