అంబేద్కర్ గురించి ముఖ్య విషయాలు ఇవే

డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విదేశాల్లో ఆర్థికశాస్త్రంలో పీహెచ్‌డీ చేసిన తొలి భారతీయుడిగా నిలిచారు. ఆయనకు తొమ్మిది భాషలు వచ్చు, వేలాది పుస్తకాలతో కూడిన వ్యక్తిగత గ్రంథాలయం ఉండేది. రోజుకు 20 గంటలకు పైగా చదివేవారని అంటారు. కార్మికుల పని గంటలను 12 నుంచి 8కి తగ్గించడంలో, మహిళా హక్కుల కోసం చట్టాలు తీసుకురావడంలో ఆయన కృషి చేశారు. 'ముక్నాయక్' పత్రికను ప్రారంభించి, ఇండిపెండెంట్ లేబర్ పార్టీని స్థాపించారు.

సంబంధిత పోస్ట్