డెయిరీ బ్రాండ్ హెరిటేజ్ ఫుడ్స్, ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డైరెక్టర్స్ (ఐఓడీ) అందించే గోల్డెన్ పీకాక్ అవార్డు 2025ను గెలుచుకుంది. సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి ఉదయ్ లలిత్ అధ్యక్షతన నియమించిన జ్యూరీ ఈ అవార్డును సిఫార్సు చేసింది. హెరిటేజ్ ఫుడ్స్ తన కార్యకలాపాలలో ఆదర్శప్రాయమైన కార్పొరేట్ గవర్నెన్స్ పద్ధతులను అమలు చేయడం వల్ల ఈ అవార్డు లభించింది. ఈ ప్రతిష్టాత్మక అవార్డు తమ కార్పొరేట్ గవర్నెన్స్ ఎక్సలెన్స్‌కు గుర్తింపు అని కంపెనీ పేర్కొంది.