పెళ్లి చేసుకున్న హీరో అర్జున్ చిన్న కూతురు

సీనియర్ నటుడు అర్జున్ సర్జా చిన్న కుమార్తె అంజన, తన ప్రియుడు ఇసాయ్ నట్టర్‌ను వివాహం చేసుకున్నారు. 14 ఏళ్ల సుదీర్ఘ ప్రేమ ప్రయాణం తర్వాత, ఈ నెల 19న విదేశాల్లో వీరి వివాహం ఘనంగా జరిగింది. అమెరికాలో చదువుకుంటున్న సమయంలో పరిచయమైన వీరిద్దరూ, గతేడాది నిశ్చితార్థం చేసుకున్నారు. తాజాగా ఈ వివాహ వేడుకకు సంబంధించిన ఫొటోలను అంజన తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పంచుకున్నారు. హిందూ సంప్రదాయ పద్ధతిలో జరిగిన ఈ వేడుక ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

సంబంధిత పోస్ట్

✕
✕