హీరో బెల్లంకొండ శ్రీనివాస్ తన తండ్రి, ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేష్‌తో కలిసి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. తన వివాహ వేడుకకు హాజరుకావలసిందిగా కోరుతూ, కేటీఆర్‌కు బెల్లంకొండ శ్రీనివాస్ పెళ్లి పత్రికను అందజేశారు. కాగా ఏప్రిల్ 29న తిరుమలలో తన ప్రేయసి కావ్య రెడ్డిని శ్రీనివాస్ పెళ్లి చేసుకొనున్నారు.