పెరిగిన హీరో స్ప్లెండర్ ప్లస్ బైక్ ధరలు

ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ హీరో మోటోకార్ప్ తన అత్యంత ప్రజాదరణ పొందిన స్ప్లెండర్ ప్లస్ బైక్ ధరలను పెంచింది. వివిధ వేరియంట్లపై రూ.1,135 నుంచి రూ.3,086 వరకు భారం పెరిగింది. బేస్ డ్రమ్, i3S, స్పెషల్ ఎడిషన్, ఫ్లెక్స్ వేరియంట్ల ధరలు పెరిగాయి. ఎక్స్‌టెక్ (XTEC) సిరీస్‌లో అదనపు ఫీచర్లు ఉన్నప్పటికీ, ధరల సవరణ జరిగింది. అయితే, హెచ్ఎఫ్ డీలక్స్ ఫ్లెక్స్ బైక్ ధరలో మాత్రం ఎలాంటి మార్పు లేదు. ఇది రూ.72,792 ధర వద్దే లభిస్తోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్

✕
✕