రాజకీయాల్లోకి హీరో సూర్య?.. క్లారిటీ

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య రాజకీయాల్లోకి వస్తారంటూ జరుగుతున్న ప్రచారానికి తెరపడింది. తనకు రాజకీయాల్లోకి ప్రవేశించే ఆలోచన లేదని ఆయన స్పష్టం చేశారు. దీపావళికి విడుదలైన తన తాజా చిత్రం 'సీన్' విజయోత్సవ వేడుకలో సూర్య ఈ వ్యాఖ్యలు చేశారు. రాజకీయాల్లోకి వెళ్లకపోయినా, రాజకీయ పరిణామాలను నిశితంగా గమనిస్తుంటానని తెలిపారు. రాజకీయాలంటే తనకు ద్వేషం లేదని, వాటిపై ఆసక్తి ఉందని పేర్కొన్నారు. మరోవైపు సూర్య అగరం ఫౌండేషన్ ద్వారా పేద విద్యార్థులకు విద్యా సహాయం అందిస్తున్నారు. దీంతో ఆయన రాజకీయాల్లోకి వస్తారనే ప్రచారం మొదలైంది.

సంబంధిత పోస్ట్

✕
✕