ఒకప్పుడు టాలీవుడ్ లో సంచలనం సృష్టించిన ఉదయ్ కిరణ్, ఎలాంటి సినీ నేపథ్యం లేకుండానే హీరోగా ఎంట్రీ ఇచ్చి వరుస విజయాలు సాధించారు. 'నువ్వు నేను', 'మనసంతా నువ్వే' వంటి చిత్రాలతో ప్రేక్షకుల మన్ననలు పొందారు. ఆయన హీరోగా పరిచయమైన 'చిత్రం' సినిమాను మొదట లవర్ బాయ్ తరుణ్ చేయాల్సి ఉందని కానీ బడ్జెట్, ఇతర కారణాలతో ఆఫర్ వదులుకున్నారని, ఆ తర్వాత తేజ దృష్టికి ఉదయ్ కిరణ్ వచ్చారని సమాచారం. ప్రస్తుతం 42 ఏళ్ల తరుణ్ పెళ్లి చేసుకోకుండా ఒంటరిగా ఉంటున్నారు.